School Fees: Actor Siva Balaji Complaint On Private Schools | Oneindia Telugu

2020-09-16 914

Tollywood actor Siva Balaji lodged a complaint in Human Rights commission on a private school in Manikonda, Hyderabad.

#SchoolFeesHike
#ActorSivaBalaji
#PrivateSchools
#HRC
#midtermexams
#onlineclasses
#cityschool
#PrivateSchoolsManagement


టాలీవుడ్ నటుడు శివ బాలాజీ ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై మానవ హక్కుల కమిషన్(HRC)కు ఫిర్యాదు చేశారు. స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరినందుకు తమ పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం తమ పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించిందన్నారు. వివరాల్లోకి వెళ్తే... నటుడు శివ బాలాజీ పిల్లలు హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ స్కూల్లో చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఇటీవల శివ బాలాజీ స్కూల్ యాజమాన్యంతో ఫీజుల గురించి మాట్లాడారు. ఫీజులు తగ్గించాలని కోరారు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం శివ బాలాజీ పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించడం శివ బాలాజీకి ఆగ్రహం తెప్పించింది. అటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ఫీజుల పెంపుపై హైదరాబాద్‌లో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన 46జీవోను ఉల్లంఘించేలా స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే... ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఫీజులు పెంచి వేధిస్తున్నాయని ఆరోపించారు.